Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Godave Godavamma
S. Janaki, S.P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
గొడవే గొడవమ్మ చేయి పట్టే చిలిపివాడమ్మ
గొడవే లేదమ్మ దారి పట్టి పొదకే పదవమ్మ
అడుగు అడిగేదడుగు... వయసే మిడిసి పడుతుంటే
తళుకే సుడులే తిరిగి ఒరిగి ఒదిగి పోతుంటే
తడిసి బెడిసి మెరిసే సొగసే ఒడిసి ఒడిసిపడుతూ
గొడవే గొడవమ్మ చేయి పట్టే చిలిపివాడమ్మ
గొడవే లేదమ్మ దారి పట్టి పొదకే పదవమ్మ
మొదటే చలి గాలి సలహాలు వింటే
ముసిరే మోహాలు దాహాలు పెంచే
కసిగా నీ చూపు నా దుంప తెంచే
అసలే నీ ఒంపు నా కొంప ముంచే
ముదిరే వలపుల్లో నిదరే సెలవంట
కుదిరే మనువుల్లో ఎదరే నే ఉంటా
బెదిరే కళ్ళలో కధలే నే వింటా
అదిరే గుండెల్లో శృతులే ముద్దంట
దోబూచులాడేటి అందమొకటి ఉంది
దోచేసుకోలేని బంధమొకటి అంది
పగతో రగిలే పరువం సిగలో విరిసే మరువం
పగలే పెరిగే బిడియం కలిసే చెరిగే ప్రణయం
గొడవే గొడవమ్మ చేయి పట్టే చిలిపివాడమ్మ
గొడవే లేదమ్మ దారి పట్టి పొదకే పదవమ్మ
అడుగు అడిగేదడుగు... వయసే మిడిసి పడుతుంటే
తళుకే సుడులే తిరిగి ఒరిగి ఒదిగి పోతుంటే
తడిసి బెడిసి మెరిసే సొగసే ఒడిసి ఒడిసిపడుతూ
గొడవే గొడవమ్మ చేయి పట్టే చిలిపివాడమ్మ
గొడవే లేదమ్మ దారి పట్టి పొదకే పదవమ్మ
ఇపుడే తెలిసింది ఈ ప్రేమ ఘాటు
పడితే తెలిసింది తొలిప్రేమ కాటు
కునుకే లేకున్నా ఈ night beat-u
ఎపుడో మార్చింది నా heart beat-u
పిలిచే వయసుల్తో జరిగే పేరంటం
మొలిచే సొగసుల్తో పెరిగే ఆరాటం
చలికే ఒళ్ళంతా పలికే సంగీతం
సరదా పొద్దుల్లో కరిగే సాయంత్రం
ఈ ఎడారి నిండా ఉదక మండలాలు
నీ సితార దాటే మౌన పంజరాలు
తనువే తగిలే హృదయం కనులై విరిసే ఉదయం
జతగా దొరికే సమయం ఒకటైపోయే ఉభయం
గొడవే గొడవమ్మ చేయి పట్టే చిలిపివాడమ్మ
గొడవే లేదమ్మ దారి పట్టి పొదకే పదవమ్మ
అడుగు అడిగేదడుగు... వయసే మిడిసి పడుతుంటే
తళుకే సుడులే తిరిగి ఒరిగి ఒదిగి పోతుంటే
తడిసి బెడిసి మెరిసే సొగసే ఒడిసి ఒడిసిపడుతూ
గొడవే గొడవమ్మ చేయి పట్టే చిలిపివాడమ్మ
గొడవే లేదమ్మ దారి పట్టి పొదకే పదవమ్మ