Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Thalabadi
Shankar Mahadevan
Popularity · High
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
తలబడి కలబడి నిలబడు
పోరాడే యోధుడు జడవడు
తలబడి కలబడి నిలబడు
పోరాడే యోధుడు జడవడు
సంకల్పం నీకుంటే ఓటమికైనా ఒణుకేరా
బుడి బుడి అడుగులు తడబడి అడుగడుగున నీవే నిలబడి
ఎదురీదాలి లక్ష్యం వైపు ఎంతో పాటుపడీ
వెలుగంటూ రాదు అంటే సూరీడైనా లోకువరా
నిశిరాతిరి కమ్ముకుంటే వెన్నెల చిన్నబోయెను రా
నీశక్తేదో తెలిసిందంటే నీకింకా తిరుగేదీ
ప్రకాశంలో సూరీడల్లే ప్రశాంతంగా చంద్రుడి మల్లే
వికాసంలో విధ్యార్ధల్లే అలా అలా ఎదగాలి
ప్రకాశంలో సూరీడల్లే ప్రశాంతంగా చంద్రుడి మల్లే
వికాసంలో విధ్యార్ధల్లే అలా అలా ఎదగాలి
పిడికిలినే బిగించి చూడూ అవకాశం నీకున్న తోడు
అసాధ్యమే తలొంచుకుంటూ క్షమించూ అనేయ్దా
రేపుందని లోకాన్ని నమ్మి అలసటతో ఆగదు భూమి
గిరా గిరా తిరిగేస్తుందీ క్రమంగా మహా స్థిరంగా
ప్రతీకలా నిజమౌతుందీ ప్రయత్నమే ఉంటే
ప్రతీకవే నువ్వవుతావు ప్రవర్తనే ఉంటే
ప్రకాశంలో సూరీడల్లే ప్రశాంతంగా చంద్రుడి మల్లే
వికాసంలో విధ్యార్ధల్లే అలా అలా ఎదగాలి
ప్రకాశంలో సూరీడల్లే ప్రశాంతంగా చంద్రుడి మల్లే
వికాసంలో విధ్యార్ధల్లే అలా అలా ఎదగాలి
జీవితమే ఓ చిన్న మజిలీ వెళిపోమా లోకాన్ని వదిలి
మళ్ళీ మళ్ళీ మోయగలవా కలల్నీ ఈ కీర్తినీ
గమ్యం నీ ఊహల జననం శోధనలో సాగేది గమనం
ప్రయాణమే ప్రాణం కాదా గెలుపుకీ ప్రతిమలుపుకీ
ప్రతిరోజూ ఉగాది కాదా ఉషస్సు నీవైతే
ప్రభంజనం సృష్టిస్తావూ ప్రతిభే చూపిస్తే
ప్రకాశంలో సూరీడల్లే ప్రశాంతంగా చంద్రుడి మల్లే
వికాసంలో విధ్యార్ధల్లే అలా అలా ఎదగాలి
ప్రకాశంలో సూరీడల్లే ప్రశాంతంగా చంద్రుడి మల్లే
వికాసంలో విధ్యార్ధల్లే అలా అలా ఎదగాలి