Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Tenchukunte Thegipothunda
S. P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
తెంచుకుంటె తెగిపోతుందా దేవుడు వేసిన బంధం
తెంచుకుంటె తెగిపోతుందా దేవుడు వేసిన బంధం
తెలుసుకో నీ జీవిత గమ్యం
పెంచుకోమ్మ అనుబంధం
ఏడు అడుగులు నడిచిన వాడే
ఏడు జన్మలు తోడుంటాడు
భర్తగా నిను భరించు వాడే
బ్రతుకు దీపం వెలిగిస్తాడు
అతని హృదయం నాతి చరామి
అగ్ని హోత్రమె అందుకు హామి
అతని హృదయం నాతి చరామి
అగ్ని హోత్రమె అందుకు హామి
తెంచుకుంటె తెగిపోతుందా దేవుడు వేసిన బంధం
తెలుసుకో నీ జీవిత గమ్యం పెంచుకోమ్మ అనుబంధం
శ్రీవారిని పూజించాలి చిరునవ్వుల హారతితో
దాంపత్యం వికసించాలి తరగని మురిపాలతో
దాసి నీవై ప్రేయసి నీవై
నీవే తన ప్రాణమై
నిండు ప్రేమను తనకందించు నూరేళ్లూ నడిపించు
పతి ఆరోగ్యమే సతి సౌభాగ్యమై
ఈ బ్రహ్మముడి విడిపోదు తల్లి ఎన్ని జన్మలైనా
మగని హృదయం మమతల నిలయం మగువకే దేవాలయం
మగని హృదయం మమతల నిలయం మగువకే దేవాలయం
తెంచుకుంటె తెగిపోతుందా దేవుడు వేసిన బంధం
తెలుసుకో నీ జీవిత గమ్యం పెంచుకోమ్మ అనుబంధం
తెగువతో తన పతి ప్రాణాలే తిరిగి తెచ్చును ఇల్లాలే
అడవిపాలై వెడలిన పతిని అనుసరించును ఇల్లాలే
చెదిరిపోని నుదుటి రాతకు శ్రీకారం దంపతులే
గాయం ఏ ఒక్కరిదైనా కన్నీళ్లూ ఇద్దరివే
పగలు రేయిగా బ్రతుకే హాయిగా
కలకాలమూ నిలవాలి మీరు పసుపు కుంకుమలుగా
ఆలుమగలే సృష్టికి మూలం
వారికే తల వంచును కాలం
ఆలుమగలే సృష్టికి మూలం
వారికే తల వంచును కాలం