Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Chukkala Chunni
SR Kalyanamandapam · Anurag Kulkarni
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
హే' చుక్కలచున్నీకే నా గుండెని కట్టావే
ఆ నీలాకాశంలో అరె గిర్రాగిర్రా తిప్పేశావే
మువ్వలపట్టీకే నా ప్రాణం చుట్టావే
నువ్వెళ్ళే దారంతా అరె ఘల్లుఘల్లు మోగించావే
వెచ్చవెచ్చని ఊపిరితోటి ఉక్కిరిబిక్కిరి చేశావే
ఉండిపో ఉండిపో ఉండిపో నాతోనే
హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా
నీవల్లే నీవల్లే పిచ్చోడిలా తయ్యారయ్యా
హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా
నీవల్లే నీవల్లే నాలో నేనే గల్లంతయ్యా
అయ్' కొత్తకొత్త చిత్రాలన్నీ ఇప్పుడే చూస్తున్నాను
గుట్టుగా దాచుకోలేను డప్పేకొట్టి చెప్పలేను
పట్టలేని ఆనందాన్ని ఒక్కడినే మొయ్యలేను
కొద్దిగా సాయం వస్తే పంచుకుందాం నువ్వు నేను
కాసేపు నువ్వు కన్నార్పకు నిన్నూను నన్ను చుస్తూనే ఉంటా
కాసేపు నువ్వు మాటాడకు కౌగిళ్ళ కావ్యం రాసుకుంటా
ఓ' ఎడారిలా ఉండే నాలో సింధూనదై పొంగావే
ఉండిపో ఉండిపో ఎప్పుడూ నాతోనే
హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా
నీవల్లే నీవల్లే పిచ్చోడిలా తయ్యారయ్యా
హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా
నీవల్లే నీవల్లే నాలో నేనే గల్లంతయ్యా
బాధనే భరించడం అందులోంచి బయటకి రాడం
చాలచాల కష్టం అని ఏంటో అంతా అంటుంటారే
వాళ్ళకి తెలుసో లేదో హాయిని భరించడం
అంతకన్న కష్టం కదా అందుకు నేనే సాక్ష్యం కదా
ఇంతలా నేను నవ్వింది లేదు, ఇంతలా నన్ను పారేసుకోలేదు
ఇంతలా నీ జుంకాలాగ మనసేనాడు ఊగలేదు
ఏ' దాయిదాయి అంటూ ఉంటే చందమామై వచ్చావే
ఉండిపో ఉండిపో తోడుగా నాతోనే
హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా
నీవల్లే నీవల్లే పిచ్చోడిలా తయ్యారయ్యా
హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా
నీవల్లే నీవల్లే నాలో నేనే గల్లంతయ్యా