Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Neelalu
Hemachandra Vedala
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
నీలాలుగారు కనులలో
కలతగా కరిగెనే జీవితం
కాలాలు మారి వలపులే
వగపుగా మిగిలెనే నా గతం
నిన్నే ప్రేమించా గుండె లోతుల
నిన్నే బాధించ గుండె కోతల
పువ్వే ఇచ్చాను ఒక నాడలా
ముల్లై గుచ్చానే నిన్ను నేడిలా
(నీలాలుగారు కనులలో)
కలతగా కరిగెనే జీవితం
నిదురపోవు నిజములో
మేలుకున్న కలలలో
నిజమైన కలైనా ఇదేనా
దూరమైనా పిలుపులో
చేరువైన వలపులో
కలకాలం నిలిచేది కథేనా
నింగికి నెలకు కలిసే అలవాటు లేదులే
కడలికి నదికి ఎపుడు
ఎడబాటు రాదులే
(నీలాలుగారు కనులలో)
కలతగా కరిగెనే జీవితం
కాలాలు మారి వలపులు
వగపుగా మిగిలెనే నా గతం
పలుకు నీవు మెల్లగా
మనసు తోడు చేరగా
నీకోసం బ్రతికున్న ఇన్నాళ్ళుగా
మనసు నిన్ను వీడగా
కారే నీరు ధారగా
ఎడబాటు కలిగింది చేదుగా
మనసైన నువ్వే నన్నే ద్వేషించినావులే
ఇటువంటి నిన్నే నేను ఊహించలేదులే
(నీలాలుగారు కనులలో)
కలతగా కరిగెనే జీవితం
కాలాలు మారి వలపులే
వగపుగా మిగిలెనే నా గతం