Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Vidhatha Talapuna
S.P. Balasubrahmanyam, P. Susheela
Popularity · Moderate
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓంమ్మ్మ్మ్ మ్మ్
ప్రాణ నాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవ నాదమ్మ్ ఓంమ్మ్మ్మ్ మ్మ్
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం
ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం మ్మ్ మ్మ్ ఆఅఅఅ
సరస స్వర సుర ఝారీగ మనమౌ సామవేద సారమిది
సరస స్వర సుర ఝారీగ మనమౌ సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం
విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం
ప్రాగ్దిశ వీణియ పైన దినకర మయూఖ తంత్రులపైనా జాగృత విహంగ తతులె వినీల గగనపు వేదిక పైన
ప్రాగ్దిశ వీణియ పైన దినకర మయూఖ తంత్రులపైనా జాగృత విహంగ తతులె వినీల గగనపు వేదిక పైన
పలికిన కిలకిల స్వరముల స్వరగతి జగతికి శ్రీకారము కాగా విశ్వకావ్యమునకిది భాష్యముగా
విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం
జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవననాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం
జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవననాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం
అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసము నే
విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం
నా ఉఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం
నా ఉఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం
సరస స్వర సుర ఝారీగ మనమౌ సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి