Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Jagame Marinadhi
Ghantasala
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
జగమే మారినది మధురముగా ఈ వేళా
జగమే మారినది మధురముగా ఈ వేళా కలలూ కోరికలూ తీరినవీ మనసారా
జగమే మారినది మధురముగా ఈ వేళా
మనసాడెనే మయూరమై పావురములు పాడె యెల పావురములు పాడె
ఇదె చేరెను గోరువంక రామ చిలుక చెంత అవి అందాలా జంట
నెనరూ కూరిమీ ఈ నాడే పండెనూ
నెనరూ కూరిమీ ఈ నాడే పండెనూ జీవిత మంతా చిత్రమైన పులకింతా
జగమే మారినది మధురముగా ఈ వేళా కలలూ కోరికలూ తీరినవీ మనసారా
జగమే మారినది మధురముగా ఈ వేళా
విరజాజుల సువాసనా స్వాగతములు పలుకా సుస్వాగతములు పలుక
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
విరజాజుల సువాసనా స్వాగతములు పలుకా సుస్వాగతములు పలుక
తిరుగాడును తేనెటీగ తియ్యదనము కోరీ అనురాగాల తేలీ
కమ్మని భావమే కన్నీరై చిందెనూ
కమ్మని భావమే కన్నీరై చిందెనూ ప్రియమగు చెలిమీ సాటి లేని కలిమీ
జగమే మారినది మధురముగా ఈ వేళా కలలూ కోరికలూ తీరినవీ మనసారా
జగమే మారినది మధురముగా ఈ వేళా
సాహిత్యం: ఆరుద్ర: దేశద్రోహులు: ఎస్. రాజేశ్వరరావు: ఘంటసాల