Skip to content

Emantaro

Mani Sharma, Harini, S.P. Charan
Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

ఏమంటారో నాకు నీకున్న ఇదిని ఏమంటారో నువ్వు నేనైన అదిని ఏమంటారో మారిపోతున్న కథని ఏమంటారో జారిపోతున్న మతిని చూసే పెదవిని మాటాడే కనులని నవ్వే నడకని కనిపించే శ్వాసని ఇచ్చిపుచ్చుకున్న మనసుని ఇదా అదా యధావిధా మరి ఏమంటారో నాకు నీకున్న ఇదిని ఏమంటారో నువ్వు నేనైన అదిని ఏమంటారో మారిపోతున్న కథని ఏమంటారో జారిపోతున్న మతిని ఎదురుగా వెలుగుతున్న నీడని బెదురుగా కలుగుతున్న హాయిని తనువున తొణుకుతున్న చురుకుని మనసున ముసురుకున్న చెమటని ఇష్టకష్టాలని ఏమంటారో ఇపుడేమంటారో ఈ మోహమాటాలని ఏమంటారో మరి ఏమంటారో స్వల్పభారాలని ఏమంటారో ఇపుడేమంటారో సమీపదూరాలని ఏమంటారో అసలేమంటారో జారే నింగిని దొరలాంటి దొంగని పాడే కొంగుని పరిమళించే రంగుని పొంగుతున్న సుధాగంగని ఇదా అదా అదే ఇదా మరి ఏమంటారో మారిపొతున్న కథని ఏమంటారో జారిపోతున్న మతిని జాబిలై తళుకుమన్న చుక్కని బాధ్యతై దొరుకుతున్న హక్కుని hey hey దేవుడై ఎదుగుతున్న భక్తుని సూత్రమై బిగయనున్న సాక్షిని పాతలో కొత్తని ఇపుడేమంటారో పోట్లాటలో శాంతిని మరి ఏమంటారో తప్పులో ఒప్పుని ఏమంటారో ఇపుడేమంటారో గతజన్మలో అప్పుని ఏమంటారో అసలేమంటారో నాలో నువ్వుని ఇక నీలో నేనుని మాకే మేమని మన దారే మనదని రాసుకున్న ఆత్మచరితని అదా ఇదా ఇదే అదా మరి ఏమంటారో నాకు నీకున్న ఇదిని ఏమంటారో నువ్వు నేనైన అదిని ఏమంటారో మారిపొతున్న కథని ఏమంటారో జారిపొతున్న మతిని