Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Keeravani
S. P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
సా ని స రి సాని
సా ని స మ గా మరి
ప ద సా ని స రి సాని ఆ హ ఆ
సా ని సమ గా మరి ఆ అ
ప ద సస ని రిరి స గగ గరి మమ గగ మా
సా ని ద ప మ గ రి స ని
కీరవాణీ
చిలకలా కొలికిరో పాడవేమే
వలపులే తెలుపగా
విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగా
అలరులు కురిసిన రుతువుల తడిసిన మధురస వాణి
కీరవాణీ
చిలకలా కొలికిరో పాడవేమే
వలపులే తెలుపగా
గ రి స ప మ గ ప ని
స రి గ రి గ స నిస
ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై
నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా
నీ గగనాలలో నే చిరు తారనై
నీ అధరాలలో నే చిరునవ్వునై
స్వరమే లయగా ముగిసే
సలలిత కలరుత స్వరనుత గతియుత గమకము తెలియకనే
కీరవాణి
చిలకలా కల కల పాడలేదు
వలపులే తెలుపగా
ఇల రాలిన పువ్వులు
వెదజల్లిన తావుల
అలికిడి ఎరుగని పిలుపుల అలిగిన మంజులవాణి
కీరవాణీ
చిలకలా కల కల పాడలేదు వలపులే తెలుపగా
నీ కన్నులా నీలమై నీ నవ్వులా వెన్నెలై
సంపెంగలా గాలినై తారాడనా నీడనై
నీ కవనాలలో నే తొలి ప్రాసనై
నీ జవనాలలో జాజుల వాసనై
యెదలో ఎదలే కదిలే
పడుచుల మనసులు పంజర సుఖముల పలుకులు తెలియకనే
కీరవాణీ
చిలకలా కలకల పాడలేదు వలపులే తెలుపగ
విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగా
అలరులు కురిసిన రుతువుల తడిసిన మధురసవాణి
కీరవాణీ
చిలకలా కొలికిరో పాడవేమే వలపులే తెలుపగా