Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Kadhile Rangula Villu Ra
Vijay Yesudas
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
కదిలే రంగుల విల్లురా
ఎదురై గుండెను గిల్లెరా
అరెరే వెన్నెల కూతురా అనిపించిదా అప్సరా
తాజమహాల్ మీదొట్టు - తన మేని రంగు మెరుపు
కోహినూరు మీదొట్టు - తన మనసు అచ్చ తెలుపు
రేయిలాంటి మైమరపు
నీలాల కురుల నలుపు
పరుగు తీసే ప్రతి తలపు ఆ రాకుమారి వైపు
అలాంటిలాంటమ్మాయ్ కాదురా
అలై వచ్చి నన్నే తాకెరా
అలా ఎలా పుట్టేసిందిరా
అమాంతంగ నచ్చేసిందిరా
బొమ్మగా తననే చేసి
బ్రహ్మ తన పనిమానేసి బుగ్గలే గిల్లాడేమో
అందమే తననే చూసి
ముద్దుగా దిష్టే తీసి హారతే పడుతుందేమో
ఆ సొగసులపై ఒక కవితే రాయాలన్నా
ఏ భాషలో పదములు అయినా సరిపోయేనా
అలాంటిలాంటమ్మాయ్ కాదురా
అలై వచ్చి నన్నే తాకెరా
ఏ అలా ఎలా పుట్టేసిందిరా
అమాంతంగ నచ్చేసిందిరా
పంజరం లేనేలేని పావురం నేనైపోయా జంటగా తనతో కదిలి
లోకమే ఏమైపోనీ పట్టని పరుగైపోయా నన్నలా విడిగా వదిలి
కొన్ని జన్మల పూజల కైనా దొరకని భాగ్యం
కోవెలలో దేవత రూపం ఆ సౌందర్యం
అలాంటిలాంటమ్మాయ్ కాదురా
అలై వచ్చి నన్నే తాకెరా
హే అలా ఎలా పుట్టేసిందిరా
అమాంతంగ నచ్చేసిందిరా