Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Ee Gaali Ee Vela
S.P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు
ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు
ననుగన్న నా వాళ్లు ఆ నా కళ్ల లోగిళ్లు
ననుగన్న నా వాళ్లు ఆ నా కళ్ల లోగిళ్లు
ఈ గాలి ఈ నేల
చిన్నారి గొరవంక కూసేను ఆ వంక
నా రాక తెలిసాక వచ్చేను నా వంక
చిన్నారి గొరవంక కూసేను ఆ వంక
నా రాక తెలిసాక వచ్చేను నా వంక
ఎన్నాళ్లో గడిచాక ఇన్నాళ్లకు కలిసాక
ఎన్నాళ్లో గడిచాక ఇన్నాళ్లకు కలిసాక
ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగిదాక
ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగిదాక
ఎగసేను నింగి దాక
ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు
ననుగన్న నా వాళ్లు ఆ నా కళ్ల లోగిళ్లు
ఈ గాలి ఈ నేల
ఏనాడు ఏ శిల్పి కన్నాడో
ఈ కలను
ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో
ఈ కళను
ఏనాడు ఏ శిల్పి కన్నాడో
ఈ కలను
ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో
ఈ కళను
ఏ వలపుల తలపులతో తెలిపాడో
ఈ కథను
ఏ వలపుల తలపులతో తెలిపాడో
ఈ కథను
ఈ రాళ్లే జవరాళ్లై ఇట నాట్యాలాడేను
ఈ రాళ్లే జవరాళ్లై ఇట నాట్యాలాడేను
కన్నె మూగమనసు కన్న స్వర్ణ స్వప్నమై
తళుకుమన్న తార చిలుకు కాంతి చినుకులై
కన్నె మూగమనసు కన్న స్వర్ణ స్వప్నమై
తళుకుమన్న తార చిలుకు కాంతి చినుకులై
గగన గళము నుండి అమరగాన వాహిని ఆ
గగన గళము నుండి అమరగాన వాహిని
జాలువారుతోంది ఇలా అమృతవర్షిణి
అమృతవర్షిణి అమృతవర్షిణి
ఈ స్వాతివానలో నా ఆత్మస్నానమాడే
నీ మురళిలో నా హృదయమే
స్వరములుగా మారే
ఆహాహ ఆహా
ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు
నను కన్న నా వాళ్లు నా కళ్ల లోగిళ్లు
ఈ గాలి ఈ నేల