Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Krishnam Vande Jagadgurum
S. P. Balasubramanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
జరుగుతున్నదీ జగన్నాటకం
జరుగుతున్నదీ జగన్నాటకం
పురాతనపు పురాణ వర్ణన
పైకి కనపడుతున్న కధనం
నిత్య జీవన సత్యమని
భాగవతలీలల అంతరార్థం
జరుగుతున్నది జగన్నాటకం
జరుగుతున్నది జగన్నాటకం
చెలియలి కట్టను తెంచుకొని
విలయము విజృంభించునని
ధర్మమూలమే మరచిన జగతిని
యుగాంతమెదురై ముంచునని
సత్యం వ్రతునకు సాక్షాత్కరించి
సృష్టి రక్షణకి చేయూతనిచ్చి
నావగ త్రోవను చూపిన మత్స్యం
కాలగతిని సవరించిన సాక్ష్యం
చేయదలచిన మహత్కార్యము
మోయజాలని భారమైతే
పొందగోరి నదందలేదని నిరాశలో అణగారిపోతే
బుసలుకొట్టే అసహనపు
నిట్టూర్పు సెగలకు నీరసించక
ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది
(క్షీరసాగర మధన మర్మం)
ఉనికిని నిలిపే ఇలను కడలిలో
కలుపగ ఉరికే ఉన్మాదమ్మును
తరాళ దంష్టుల కుళ్లగించి
ఈ ధరాతలమ్మును ఉద్ధరించగల
ధీరోద్ధతి రణహుంకారం ఆదివరాహపు ఆకారం
(వీరా వీరా వీరా వీరా వీరా)
(ఏదీ ఎక్కడరా నీహరి)
(దాక్కున్నాడేరా భయపడి)
(బయటకు రమ్మనరా)
(ఎదుటబడి నన్ను గెలవగలడా తలబడి)
(నువ్ నిలచిన ఈ నేలని అడుగు)
(నీ నాడుల జీవజలమ్ముని అడుగు)
(నీ నెత్తుటి వెచ్చదనాన్నడుగు)
(నీ ఊపిరిలో గాలిని అడుగు)
(నీ అడుగుల ఆకాశాన్నడుగు)
(నీలో నరునీ హరినీ కలుపు)
(నీవే నరహరివని నువ్ తెలుపు)
(ఉన్మత్త మాతంగ భంగి ఘాతుక వితతి)
(హంతృ సంఘాత నీ ఘృణ నిబిడమీ జగతి)
(అఘము నగమై ఎదిగే అవనికిదే అశనిహతి)
ఆతతాయుల నిహతి అనివార్యమౌ నియతి
(చితమస్తి హతమస్తకారి నఖ సమకాసియో)
(కౄరాసి గ్రోసి హృతదాయ దంష్టుల ద్రోసి)
(మసిజేయ మహితయఙ్నం)
అనేయమనూహ్యమనంత విశ్వం
ఆ బ్రహ్మాండపు సూక్ష్మస్వరూపం
ఈ మానుష రూపం కుక్జ్యాకృతిగా
బుధ్ధిని భ్రమింపజేసే అల్పప్రమాణం
ముజ్జగాలను మూడడుగులతో కొలిచే
కైవిక్రమ విస్తరణం
జరుగుతున్నదీ జగన్నాటకం
(జగ జగ జగ జగ జగన్నాటకం)
జరుగుతున్నది జగన్నాటకం
జగ జగ జగ జగమే నాటకం
పాపపు తరువై పుడమికి బరువై
పెరిగిన ధర్మఙ్ఞానిని పెరుగక
పరశురాముడై భయదభీముడై
పరశురాముడై భయదభీముడై
ధర్మాగ్రహ విగ్రహుడై నిలచిన
సౌద్రియ క్షత్రియ తత్వమే భార్గవుడు
ఏ మహిమలూ లేక ఏ మాయలూ లేక
నమ్మశక్యముగాని ఏ మర్మమూ లేక
మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి
మహిత చరితగ మహిని మిగలగలిగే మణికి
సాధ్యమేనని పరంధాముడే రాముడై
ఇలలోన నిలచి
ఇన్ని రీతులుగ ఇన్నిన్ని పాత్రలుగా
నిన్ను నీకే నూత్నపరిచితునిగా
దర్శింపజేయగల జ్ఞాన దర్పణమూ
కృష్ణావతారమే సృష్ట్యావరణ తరణమూ
అరిమగ మహిమగ గరిమగ లఖిమగ
ప్రాప్తిగా ప్రాధామ్యవర్తిగా
ఈశత్వముగా వశిత్వమ్ముగ
నీలోని అష్టసిధ్ధులూ నీకు కన్వట్టగా
స్వస్వరూపమే విశ్వరూపమ్ముగా
నరుడిలోపలి పరుడిపై దృష్టి పరుపగా
తలవంచి కైమోడ్చి శిష్యుడవు నీవైతే
నీ ఆర్తి కడదేర్చు ఆచార్యుడవు నీవే
వందే కృష్ణం జగద్గురుం
వందే కృష్ణం జగద్గురుం
కృష్ణం వందే జగద్గురుం
కృష్ణం వందే జగద్గురుం
వందే కృష్ణం జగద్గురుం
వందే కృష్ణం జగద్గురుం
కృష్ణం వందే జగద్గురుం
కృష్ణం వందే జగద్గురుం
కృష్ణం వందే జగద్గురుం