Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Maguva Maguva
Sid Sriram
Popularity · High
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
మగువా మగువా లోకానికి తెలుసా
నీ విలువా
మగువా మగువా నీ సహనానికి
సరిహద్దులు కలవా
అటు ఇటు అన్నింటా
నువ్వే జగమంతా
పరుగులు తీస్తావు ఇంటా బయటా
అలుపని రవ్వంత అననే అనవంటా
వెలుగులు పూస్తావే వెళ్లే దారంతా
(స గమపమగస గమపమగస)
(గమపమగ గమపమగ గమనిపమస)
(స గమపమగస గమపమగస)
(గమపమగ గమపమగ గమనిపమస)
మగువా మగువా లోకానికి తెలుసా
నీ విలువా
మగువా మగువా నీ సహనానికి
సరిహద్దులు కలవా
నీ కాటుక కనులు విప్పారకపోతే
ఈ భూమికి తెలవారదుగా
నీ గాజుల చేయి కదలాడకపోతే
ఏ మనుగడ కొనసాగదుగా
ప్రతి వరుసలోను ప్రేమగా
అల్లుకున్న బంధమా
అంతులేని నీ శ్రమ అంచనాలకందుమా
ఆలయాలు కోరని ఆది శక్తి రూపమా
నీవు లేని జగతిలో
దీపమే వెలుగునా
నీదగు లాలనలో ప్రియమగు పాలనలో
ప్రతి ఒక మగవాడు పసివాడేగా
ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా
ఆ సిరి మెరుపులకి మూలం నువ్వేగా
(స గమపమగస గమపమగస)
(గమపమగ గమపమగ గమనిపమస)
(స గమపమగస గమపమగస)
గమపమగ గమపమగ గమనిపమస)
మగువా మగువా లోకానికి తెలుసా
నీ విలువా
మగువా మగువా నీ సహనానికి
సరిహద్దులు కలవా
(స గమపమగస గమపమగస)
(గమపమగ గమపమగ గమనిపమస)
(స గమపమగస గమపమగస)
(గమపమగ గమపమగ గమనిపమస)