Nee Jilugupaita
Popularity · Low
Listen
YouTube
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
నీ నడుముపైన చేయి వేసి నడువని నన్ను నడువని
నీ చేతుల చెరసాలలోన చేరని నన్ను చేరని
నీ జిలుగుపైట నీడలోన నిలువని నన్ను నిలువని
నీ అడుగులోన అడుగువేసి నడువని నన్ను నడువని
చిక్కని బుగ్గలపై చిటికెలు వేయని
సన్నని నవ్వులలో సంపెంగలేరని
గులాబి పెదవులనే అలా అలా చూడని
నీ జిలుగుపైట నీడలోన నిలువని నన్ను నిలువని
నీ అడుగులోన అడుగులేసి నడువని నన్ను నడువని
పచ్చిగ తిన్నెలలో వెచ్చగ సాగని
వెచ్చని వెన్నెలలో ముచ్చటలాడని
ముచ్చటలాడి ఆడి మురిసి మురిసి పాడని
నీ జిలుగుపైట నీడలోన నిలువని నన్ను నిలువని
నీ అడుగులోన అడుగు వేసి నడువని నన్ను నడువని
మబ్బుల వాడలో మనసులు కూడని
మల్లెల మేడలో మమతలు పండని
ఆ ఆ ఆ
ఆఆ
బంగారు కోవెలలో కొంగులు ముడివేయని
బంగారు కోవెలలో కొంగులు ముడివేయని
సాహిత్యం: సినారె