Skip to content

Mounamendhuku

Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

మౌనమెందుకు మాటాడవెందుకు దూరమెందుకు దరిచేరవెందుకు ఎదమారుమూల దాగివున్నమాట దాచి ఉంచకు ఎదురైన వేళ అదుపుదాటి చేరవెందుకు మౌనమెందుకు మాటాడవెందుకు దూరమెందుకు దరిచేరవెందుకు అంత బిగువా మెట్టుదిగవా ఎంత ఇష్టం ఉన్నా పైకి చెప్పవా ఇంత తెగువా మాటవినవా కొంత కష్టమైనా కాస్త ఆగవా మది నాకు చెప్పకుండ నీ వెంట పడ్డది మన చేతిలోన ఉంద ఈ ప్రేమ పద్ధతి తప్పేమి ఉన్నది నిజమొప్పుకొందుకు దారేమి ఉన్నది నిను తప్పుకొందుకు మౌనమెందుకు మాటాడవెందుకు దూరమెందుకు దరిచేరవెందుకు నందకిషోరా నవనీతచోరా నవమన్మదాధారా రారా నన్నేలుకోవేరా చెయ్యందుకోరా శృంగారశూరా చేరంగరావేరా కృష్ణా చెట్టెక్కిదిగవేరా రెచ్చగొట్టినా నవ్వుతున్నదే మత్తు కమ్మేసిందా కన్నెమనసుని ఎంత కుట్టినా కెవ్వుమనదే పువ్వు పొమ్మంటుందా తేనెటీగని నిను చూడకుంటె ప్రాణం ఇక నిలువనన్నది పదునైన పూలబాణం నను తాకుతున్నది దారేమి ఉన్నది నిను తప్పుకొందుకు తప్పేమి ఉన్నది నిజమొప్పుకొందుకు మౌనమెందుకు మాటాడవెందుకు దూరమెందుకు దరిచేరవెందుకు ఎదమారుమూల దాగివున్నమాట దాచి ఉంచకు ఎదురైన వేళ అదుపుదాటి చేరవెందుకు నందకిషోరా నవనీతచోరా నవమన్మదాధారా రారా నన్నేలుకోవేరా చెయ్యందుకోరా శృంగారశూరా చేరంగరావేరా కృష్ణా చెట్టెక్కిదిగవేరా సాహిత్యం: సిరివెన్నెల: క్లాస్ మేట్స్: కోటి: హేమచంద్ర