Skanda Jo Laali(Ramya Behra): Traditional Telugu Lullaby [Kumaraswami]
Karthik Kodakandla
Popularity · Low
Listen
YouTube
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
నెమలి వాహనమెక్కి తిరిగే బాలుడికి లాలీ
మురిపాల జోలాలీ
సురులకే సేనాధిపతి కీ మధురమగు లాలీ
ముజ్జగములా లాలీ
పార్వతీ పరమేశ్వర తనయుడు స్వామినాధుడట
కుమారస్వామి అట
కృత్తికలు పాలించి పెంచిన కార్తికేయుడట
ముద్దు బాలుడట
నిదురకి వేలాయనట
జోలాలి జోలాలి
జోలాలి జోలాలి
నెమలి వాహనమెక్కి తిరిగే బాలుడికి లాలీ
మురిపాల జోలాలీ
సురులకి సేనాధిపతికీ మధురమగు లాలీ
ముజ్జగముల లాలీ
శివుని తేజం శిశువుగా ఇల వెలసిన కథ నీది
సర్ప రూపుగా భక్తులను కాపాడు లీల యే నీది
ఆరు ముఖముల జ్ఞానమూర్తిగా అవతరించేనట
అన్న గణపతి ముద్దుల తమ్ముడివి నీవు అట
జోలాలి జోలాలి
జోలాలి జోలాలి
దేవతల కాపాడ వెలసిన స్కంద జోలాలి
సుబ్రహ్మణ్య జోలాలి
తారకాసుర వధను చేసిన మురుగ జోలాలి
శరవణభవకు జోలాలి
శూలధారీగ ద్రష్టులు శిక్షించి మా స్వామి
నీకు జోలాలి
వల్లీ దేవసేనల ప్రియనాధుడికి లాలీ
దేవ జోలాలి
షణ్ముఖుడ జోలాలి
జోలాలి జోలాలి
జోలాలి జోలాలి
తల్లి పార్వతి నీకు పాడేను తీయనగు జోలాలి
అమ్మ గంగే పాడుతున్నది చల్లని ఒక లాలి
ఇహం పరములనీచ్చు గుహుడికి పాడే మరు లాలీ
పంచభూతములన్నీ పాడెను పరమభక్తితో లాలీ
జోలాలి జోలాలి
జోలాలి జోలాలి
నెమలివాహనమెక్కి తిరిగే బాలుడికి లాలీ
మురిపాల జోలాలీ
సురులకే సేనాధిపతి కీ మధురమగు లాలీ
ముజ్జగముల లాలీ
పార్వతీ పరమేశ్వర తనయుడు స్వామినాధుడట
కుమార స్వామి అట
కృత్తికలు పాలించి పెంచిన కార్తికేయుడట
ముద్దు బాలుడట
నిదురకు వేలాయనట
జోలాలి జోలాలి
జోలాలి జోలాలి