Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Na Kosam Raleva
Srinidhi Sriprakash
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
నా కోసం రాలేవా
నీ కోసం నే వేచాగా ఇన్నాళ్లు
నా పిలుపే వినలేవా
హృదయం లోతుల్లోంచి పలికే
ఈ భావాలు
ఎన్నో ఏకాంతాల చిరునామా
ప్రేమే అని అనుకోనా
ఏవో తెలియని దారుల్లో
పయనం నీవైపే సాగేనా
అవును కాదు అంటూ
పడుతున్నా హైరానా
నిన్నే చేరుకుంటే తీరేనా
నీతో పంచుకున్న
ప్రతి ఆశ కలిసొచ్చి
నన్నే అల్లుకున్న నిమిషానా
నా కోసం రాలేవా
నీ కోసం నే వేచాగా ఇన్నాళ్లు
నా పిలుపే వినలేవా
హృదయం లోతుల్లోంచి పలికే
ఈ భావాలు
ఇది వరకు నేనెపుడు ఊహించలేదే
శత కోటి నిమిషాల ఎడబాటుని
ఈ రోజు నీచెంత చేరేంతవరకూ
నాలోన నీదైన ఈ శ్వాసని
దూరాల భారాలు నే మోయలేనంటూ
నా మనసు పడుతున్న ఈ భాదని
తీర్చేసి వేవేళ సంతోష రాగాలు
పలికించి నాతోడువై నువ్వు ఉండాలి
నా కోసం రాలేవా
నీ కోసం నే వేచాగా ఇన్నాళ్లు
నా పిలుపే వినలేవా
హృదయం లోతుల్లోంచి పలికే
ఈ భావాలు
ఏ చిన్న తగువులు విడదీయ కూడదు
ఒకటైన మన రెండు హృదయాలని
నీ తోడులో నేను మైమరచి చూడాలి
సరి కొత్త వెలుగుల ఉదయాలని
నాలోనే మౌనంగా దాచుంచుకోలేను
నీపైన మొదలైన ఈ ప్రేమని
ఈ స్నేహమే చాలు
ఇన్నేళ్ల స్వప్నాలు
ఇకపైన నీ నీడలో చేరుకోవాలి
నా కోసం రాలేవా
నీ కోసం నే వేచాగా ఇన్నాళ్లు
నా పిలుపే వినలేవా
హృదయం లోతుల్లోంచి పలికే
ఈ భావాలు
ఎన్నో ఏకాంతాల చిరునామా
ప్రేమే అని అనుకోనా
ఏవో తెలియని దారుల్లో
పయనం నీవైపే సాగేనా
అవును కాదు అంటూ
పడుతున్నా హైరానా
నిన్నే చేరుకుంటే తీరేనా
నీతో పంచుకున్న
ప్రతి ఆశ కలిసొచ్చి
నన్నే అల్లుకున్న నిమిషానా
నా కోసం రాలేవా
నీ కోసం నే వేచాగా ఇన్నాళ్లు
నా పిలుపే వినలేవా
హృదయం లోతుల్లోంచి పలికే
ఈ భావాలు