Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Chanduruni Minchu
Ghantasala
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
చందురుని మించు అందమొలికించు ముద్దుపాపాయివే
నిను కన్నవారింట కష్టములనీడ కరగిపోయేనులే
కరుణతో జూచి కనకదుర్గమ్మ కామితములిచ్చులే
లోకములనేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే
చందురునిమించు అందమొలికించు ముద్దుపాపాయివే
నిను కన్నవారింట కష్టములనీడ కరగిపోయేనులే
కరుణతో జూచి కనకదుర్గమ్మ కామితములిచ్చులే
లోకములనేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే
అన్న ఒడి జేర్చి ఆటలాడించు నాటి కథ పాడనా
నాటి కథ పాడనా
కలతలకు లొంగి కష్టముల క్రుంగు నేటి కథ పాడనా
కన్నీటి కథ పాడనా
కలతలకు లొంగి కష్టముల క్రుంగు కన్నీటి కథ పాడనా
కంటిలో పాప ఇంటికే జ్యోతి చెల్లి నా ప్రాణమే
చెల్లి నా ప్రాణమే
మము విధియె విడదీసె వెతలలో ద్రోసే మిగిలెనీ శోకమే
మిగిలెనీ శోకమే
విధియె విడదీసె వెతలలో ద్రోసే మిగిలెనీ శోకమే
చందురునిమించు అందమొలికించు ముద్దుపాపాయివే
నిను కన్నవారింట కష్టములనీడ కరగిపోయేనులే
మనసులను కలుపు మధుర బంధాలు మాసిపోరాదులే
పెరిగి నీవైన మామగారింటి మనువునే కోరుమా
బంధమే నిల్పుమా మా బంధమే నిల్పుమా
కాలమెదురైన గతులు వేరైన మమతలే మాయునా
పెరిగి నీవైన అత్తగారింట కోడలిగ చేరుమా
బంధమే నిల్పుమా మా బంధమే నిల్పుమా
దివిలో తారకలు భువిలో మానవులు ధూళిలో కలసినా
అన్నచెల్లెళ్ళ జన్మబంధాలె నిత్యమై నిల్చులే
లాలి పాపాయి హాయి పాపాయి లాలి పాపాయి జో జో
లాలి పాపాయి జో జో...