Oh Panchavennala - Oh Maradala
Popularity · Low
Listen
YouTube
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
ఓ మరదలా... నాలో పొంగి పొరలే ప్రేమ వరదలా
నీరూ పాలూ కలిసి ఒకటైనటులే... నీవూ నేనూ ఒకటే గదా
ఓ పంచవన్నెల చిలకా... ఆ?... ఆ
ఓ పంచవన్నెల చిలకా... నీకెందుకింత అలక?
ఓ పంచవన్నెల చిలకా... నీకెందుకింత అలక?
మాటాడవేమే... మాటాడవేమే... నీ నోటి ముత్యాలొలక
పంచవన్నెల చిలకా...
ఓ పంచవన్నెల చిలకా... నీకెందుకింత అలక?
ఓ పంచవన్నెల చిలకా... నీకెందుకింత అలక?
ఓహో బావా... మార్చుకో నీ వంకరటింకర దోవ
ఊరికే నీవూ నేనూ ఒకటేననుకుంటే... ఒప్పుతుందా యీ లోకం?
ఓ కొంటె బావగారూ... హాయ్!
ఓ కొంటె బావగారూ... మనకెందుకింక పోరు?
ఓ కొంటె బావగారూ... మనకెందుకింక పోరు?
మా నన్నగారు చూస్తే...
మా నన్నగారు చూస్తే... మీ దుమ్ము దులుపుతారు!
ఓ కొంటె బావగారూ...
ఓ కొంటె బావగారూ... మనకెందుకింక పోరు?
సీమటపాకాయలాగ చిటాపటాలాడేవు
సీమటపాకాయలాగ చిటాపటాలాడేవు
ప్రేముందా లేదా... ఓ మరదలా నా మీద?
పంచవన్నెల చిలకా...
ఓ పంచవన్నెల చిలకా... నీకెందుకింత అలక?
మరదలినైతే మాత్రం మరీ అంత చనువా?
మరదలినైతే మాత్రం మరీ అంత చనువా?
మరియాద కాదు మీ బావ మరిది చొరవ
ఓ కొంటె బావగారూ...
ఓ కొంటె బావగారూ... మనకెందుకింక పోరు?
మా నన్నగారు చూస్తే...
మా నన్నగారు చూస్తే... మీ దుమ్ము దులుపుతారు
ఓ కొంటె బావగారూ... ఓ పంచవన్నెల చిలకా
ఓ కొంటె బావగారూ... ఓ పంచవన్నెల చిలకా