Skip to content

Idhedho Bagundhe

Prabhas, Anushka Shetty, Richa Gangopadhyay
Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే చాటుగ నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే ఘాటుగ పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే రాటుగ సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే లేటుగు ఇంతందాన్ని చూశానా అనిపిస్తుందే నా మనసే నీవైపొస్తుందే ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి నీ మతి పోగొడుతుంటె నాకెంతో సరదాగుందే ఆశలు రేపేడుతుంటే నాకెంతో సరదాగుందే నిన్నిల్లా అల్లాడిస్తే నాకెంతో సరదాగుందే అందంగా నోరూరిస్తే నాకెంతో సరదాగుందే నీ కష్టం చూస్తూ అందం అయ్యయ్యొ అనుకుంటునే ఇలాగే ఇంకాసేపంటుంటే ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి తెలుసుకుంటావా తెలుపమంటావా మనసు అంచుల్లో నించున్న నా కలని ఎదురు చూస్తున్న ఎదుటనే ఉన్న బదులు దొరికేట్టు పలికించు నీ స్వరాన్ని వేల గొంతుల్లోన మోగిందే మౌనం నువ్వున్న చోటే నేనని చూసి చుడంగానే చెప్పిందే ప్రాణం నేన్నీదాన్నై పోయానని ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి తరచి చూస్తూనే తరగదంటున్న తళుకు వర్ణాల నీ మేను పూలగనీ నలిగిపొతునే వెలిగిపొతున్న తనివి తీరేట్టు సంధించు చూపులన్ని కంటి రెప్పలు రెండు పెదవుల్లా మారి నిన్నే తీరేస్తామన్నాయే నేడో రేపో అది తప్పదుగా మరి నీకోసం ఎదైనా సరే ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి: మిర్చి: దేవి శ్రీ ప్రసాద్: విజయ్ ప్రకాష్, అనిత కార్తికేయన్