Chirugaali Veechena
Popularity · Low
Listen
YouTube
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
చిరుగాలి వీచెనే చిగురాశ రేపెనే
చిరుగాలి వీచెనే చిగురాశ రేపెనే
వెదురంటి మనసులో రాగం వేణువూదెనే మేఘం మురిసి పాడెనే
కరుకైన గుండెలో చిరుజల్లు కురిసెనే
తనవారి పిలుపులో ఆశలు వెల్లువాయెనే ఊహలు ఊయలూపెనే
ఆశలు వెల్లువాయెనే ఊహలు ఊయలూపెనే
చినుకురాక చూసి మది చిందులేసెనే
చిలిపితాళమేసి చెలరేగిపోయెనే
చిరుగాలి వీచెనే చిగురాశ రేపెనే
వెదురంటి మనసులో రాగం వేణువూదెనే మేఘం మురిసి పాడెనే
తుళ్ళుతున్న చిన్ని సెలయేరు గుండెలోన పొంగి పొలమారు
అల్లుకున్న ఈ బంధమంతా వెల్లువైనదీ లోగిలంతా
పట్టెడన్నమిచ్చి పులకించే నేలతల్లివంటి మనసల్లే
కొందరికే హృదయముంది నీకొరకే లోకముంది
నీకు తోడుఎవరంటూ లేరు గతములో
నేడు చెలిమికై చాపే వారే బతుకులో
కలిసిన బంధం కరిగిపోదులే మురళిమోవి విరివితావి కలిసినవేళ
చిరుగాలి వీచెనే చిగురాశ రేపెనే
వెదురంటి మనసులో రాగం వేణువూదెనే మేఘం మురిసి పాడెనే
ఓ' మనసున వింత ఆకాశం మెరుపులు చిందె మనకోసం
తారలకే తళుకుబెళుకా ప్రతిమలుపూ ఎవరికెరుక
విరిసిన ప్రతి పూదోట కోవెల ఒడి చేరేనా
ఋణమేదో మిగిలి ఉంది ఆ తపనే తరుముతోంది
రోజూ ఊయలే ఊగే రాగం గొంతులో
ఏవో పదములే పాడే మోహం గుండెలో
ఏనాడూ తోడులేకనే కడలి ఒడిని చేరుకున్న గోదారల్లే
కరుకైన గుండెలో చిరుజల్లు కురిసెనే
తనవారి పిలుపులో ఆశలు వెల్లువాయెనే ఊహలు ఊయలూపెనే
ఆశలు వెల్లువాయెనే ఊహలు ఊయలూపెనే
చినుకురాక చూసి మది చిందులేసెనే
చిలిపితాళమేసి చెలరేగిపోయెనే