Skip to content

Muddugare Yashodha

Nitya Santhoshini
Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

పల్లవి ముద్దు గారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వజ్రము కాంతుల మూడు లోకాల గరుడపచ్చా పూస చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు రతికేళి రుఖ్మినికి రంగుమోవి పగడము మితి గోవర్ధనపు గోమేధికము సతమై శంఖచక్రాల సందుల వైదూర్యము గతియై మమ్ము గాచే కమలాక్షుడు కాళింగుని తలలాపై గప్పిన పుష్యరాగము యేలేటి శ్రీ వేంకటాద్రి ఇంద్రనీలము పాలజలనిధిలోన బాయని దివ్య రత్నము బాలునీవలె దిరిగే పద్మనాభుడు