Amma Ani Kothaga
Shashikiran, Shravana Bhargavi
Popularity · Low
Listen
YouTube
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
సాహిత్యం: వనమాలి
గానం: శశికిరణ్, శ్రావణభార్గవి
అమ్మా అని కొత్తగా. మళ్ళీ పిలవాలనీ
తుళ్ళే పసి ప్రాయమే. మళ్ళీ మొదలవ్వనీ
నింగీ నేలా నిలిచేదాకా తోడుగా
వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
నువు కావాలే అమ్మా
నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా
అమ్మా అని కొత్తగా. మళ్ళీ పిలవాలనీ
తుళ్ళే పసి ప్రాయమే. మళ్ళీ మొదలవ్వనీ
నిదురలో నీ కల చూసి తుళ్ళి పడిన ఎదకీ
ఏ క్షణం ఎదురవుతావొ జోల పాటవై
ఆకలని అడగక ముందే నోటిముద్ద నువ్వై
ఏ కథలు వినిపిస్తావొ జాబిలమ్మవై
నింగీ నేలా నిలిచేదాకా తోడుగా
వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
నువు కావాలే అమ్మా
నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా
నా . . నా . . నా . నా.!
నీకు పసిపాపలమేగ ఎంత ఎదుగుతున్నా
జాలిపడి మాజతలోనే ఉండిపో ఇకా
ఆఖరికి దేవుడికైనా అమ్మ మనసు ఉంటే
నీకు తన బదులుగ కొత్త జన్మ నివ్వడా
నింగీ నేలా నిలిచేదాకా తోడుగా
వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
నువు కావాలే అమ్మా
నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా