Pagale Vennela
Popularity · Low
Listen
YouTube
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పగలే వెన్నెలా జగమే ఊయల
కదలె వూహలకే కన్నులుంటే ఏఏఏ ఏఏఏ
పగలే వెన్నెలా జగమే ఊయల
నింగిలోన చందమామ తోంగి చూచే నీటిలోన కలువభామ పోంగి పూచే ఏఏఏ
యీ అనురాగమే జీవనరాగమై
యీ అనురాగమే జీవనరాగమై యెదలొ తేనేజల్లు కురిసిపోదా ఆ ఆ ఆ ఆ
పగలే వెన్నెలా జగమే ఊయల
కడలి పిలువ కన్నేవాగు పరుగుతీసే
మురళిపాట విన్ననాగు శిరసునూపే
యీ అనుబంధమే మధురానందమై
యీ అనుబంధమే మధురానందమై ఇలపై నందనాలు నిలిపిపోదా ఆ ఆ ఆ ఆ
పగలే వెన్నెలా జగమే ఊయల
నీలి మబ్బు నీడలేచి నెమలి ఆడే
పూలరుతువు సైగ చూచి పికము పాడే
నీలి మబ్బు నీడలేచి నెమలి ఆడే
పూలరుతువు సైగ చూచి పికము పాడే
మనసే వీణగా ఝున ఝున మ్రోయగా
బ్రతుకే పున్నమిగా విరిసిపోదా
పగలే వెన్నెలా జగమే ఊయల
కదలె వూహలకే కన్నులుంటే ఏఏఏ ఏఏఏ
పగలే వెన్నెలా