Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Keeravaani
Vandemataram Srinivas
,
Udit Narayan
,
Swarnalatha
Popularity · Moderate
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం
కొత్త కొత్త ఉహాలతో వణికిందొక అధరం
గాలిలోన తేలి పోవు
రాజహంసవు నీవంటా
నిన్ను తాకి పొంగిపోవు
నీలి మబ్బుని నేనంటా
వానలా వచ్చి వరదలా పొంగు
ప్రేమవే నీవా
మెరుపులా మైమరుపులా జత చేరగా రావా
కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం
కొత్త కొత్త ఉహాలతో వణికిందొక అధరం
మంచు వెన్నెల స్నానమాడిన
మల్లె పందిరిలో
వలపు వాకిట వేచి నిలిచిన
వయసు పల్లకిలో
ఏకాంత సేవకు ఉర్రూతలూగిన
శృంగార శిల్పానివా
కళ్యాణ రాముని కౌగిట్లో వదిగిన
బంగారు పుష్పానివా
పంచుకో ప్రియతమా ప్రేమనే ప్రేమగా
తీయగా తీయ తీయగా తమకానివై ప్రేమా
కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం
కొత్త కొత్త ఉహాలతో వణికిందొక అధరం
కదనసీమకు కాలు దువ్విన
గడుసు మన్మధుడా
కౌగిలింతల కాటువేయకు చిలిపి చందురుడా
వేవేల సొగసులు వెచ్చంగ పొదిగిన
వయ్యారి ముందుండగా
మందార పెదవుల గంధాలు తీయక
అయ్యారే ఉండేదెలా
అందుకో అధరమే హాయిగా
ఏకమై ఘాటుగా అలవాటుగా
తెరచాటుగా భామా
కీరవాణి రాగంలో
పిలిచిందొక హృదయం
కొత్త కొత్త ఉహాలతో
వణికిందొక అధరం
గాలిలోన తేలి పోవు
రాజహంసవు నీవంటా
నిన్ను తాకి పొంగిపోవు
నీలి మబ్బుని నేనంటా
వానలా వచ్చి వరదలా పొంగు
ప్రేమవే నీవా
మెరుపులా మైమరుపులా
జత చేరగా రావా
కీరవాణి రాగంలో
పిలిచిందొక హృదయం
కొత్త కొత్త ఉహాలతో
వణికిందొక అధరం