Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Pillaa Raa - From "RX 100"
Chaitan Bharadwaj
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
మబ్బులోన వాన విల్లులా
మట్టిలోన నీటి జల్లులా
గుండెలోన ప్రేమముల్లులా దాగినావుగా
అందమైన ఆశ తీరక
కాల్చుతోంది కొంటె కోరిక
ప్రేమ పిచ్చి పెంచడానికా చంపడానికా
కోరుకున్న ప్రేయసివే దూరమైన ఊర్వశివే
జాలిలేని రాక్షసివే గుండెలోని నా కసివే
చేపకళ్ళ రూపసివే చిత్రమైన తాపసివే
చీకటింట నా శశివే సరసకు చెలి చెలి రా
ఎల్లా విడిచి బతకనే పిల్లా రా
నువ్వే కనబడవా కళ్ళారా
నిన్నే తలచి తలచిలా ఉన్నాగా
నువ్వే ఎద సడివే అన్నాగా
ఎల్లా విడిచి బ్రతకనే పిల్లా రా
నువ్వే కనబడవా కళ్ళారా
నిన్నే తలచి తలచిలా ఉన్నాగా
నువ్వే ఎద సడివే
మబ్బులోన వాన విల్లులా
మట్టిలోన నీటి జల్లులా
గుండెలోన ప్రేమముల్లులా దాగినావుగా
అందమైన ఆశ తీరక
కాల్చుతోంది కొంటె కోరిక
ప్రేమ పిచ్చి పెంచడానికా చంపడానికా
చిన్నాదాన ఓసి అందాల మైనా
మాయగ మనసు జారి పడిపోయెనే
తపనతో నీవెంటే తిరిగినే నీ పేరే పలికెనే
నీలాగే కులికెనే నిన్ను చేరగా
ఎన్నాళ్ళైనా అవి ఎన్నేళ్ళు అయినా
వందేళ్ళు అయినా వేచి ఉంటాను నిన్ను చూడగా
గండాలైనా సుడిగుండాలు అయినా
ఉంటానిలా నేను నీకే తోడుగా
ఓ ప్రేమ మనం కలిసి ఒకటిగా ఉందామా
ఇదో ఎడతెగని హంగామా
ఎల్లా విడిచి బతకనే పిల్లా రా
నువ్వే కనబడవా
అయ్యో రామ ఓసి వయ్యారి భామ
నీవొక మరపురాని మృదుభావమే
కిల కిల నీ నవ్వు తలుకులే నీ కళ్ళ మెరుపులే
కవ్విస్తూ కనపడే గుండెలోతులో
ఏం చేస్తున్నా నేను ఏ చోట ఉన్నా
చూస్తునే ఉన్నా కోటి స్వప్నాల ప్రేమరూపము
గుండె కోసి నిన్ను అందులో దాచి
పూజించనా రక్తమందారాలతో
కాలాన్నే మనం తిరిగి వెనకకే తోద్దామా
మళ్ళీ మన కధనే రాద్దామా
ఎల్లా విడిచి బతకనే పిల్లా రా
నువ్వే కనబడవా