Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Tell Me You Love Me
K. Veeru
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
నిన్ను చూసి నన్ను నేను మరిచిపోతినే
నిన్ను తలచి నేను ఇలా మారిపోతెనే
నీలోన నేనుండనా నీకు నూరేళ్ళు తోడుండనా
నీడల్లే నేనుండనా నీ గుండెల్లో దాగుండనా
గుప్పెడైన గుండెలోన గూడు కట్టి ఉండనా
(సయ్యారే సయ్యా సందేళ మామయ్య వచ్చాడే)
(ఈ వయ్యారి ఒళ్ళోన తెల్లారి ఉయ్యాలలూగాడే)
పెదవులపైన (మురిపెంగ మురిపెంగ)
మురిపాలు చల్లి (చల్లంగ చల్లంగ)
హృదయాలు మీటి (మధురంగా మధురంగా)
సరసాల తోటి (సారంగ సారంగ)
కంటిలోని కాగితాలు కబురు పంపెనే
ఒంటిలోని ఓనమాలు ఒడికి చేర్చెనే
ఏ పూజ పుణ్యానివో నువ్వు
ఏ పూల గంధానివో
ఏ చంద్రబింబానివో నువ్వు
ఏ సూర్య కిరణానివో
అందరాని కొమ్మలోని ఆమని చామంతివో
(సయ్యారే సయ్యా సందేళ మామయ్య వచ్చాడే)
(ఈ వయ్యారి ఒళ్ళోన తెల్లారి ఉయ్యాలలూగాడే)
వెన్నెలపైన (వెచ్చంగ వెచ్చంగ)
వేదాలు చదివి (వేదంగ వేదంగ)
పందిళ్ళలోన (సంపెంగ సంపెంగ)
పీటల్లు వేసి (పిలవంగా పిలవంగా)
దాచుకున్న దరహాసం దాసి కోసమా
పొంచి ఉన్న మధుమాసం ప్రేమ కోసమా
ఏ తీపి రాగానివో నువ్వు
ఏ పూల బాణానివో
ఏ వర్ణ చిత్రానివో నువ్వు
ఎల్లోరా శిల్పానివో
నిదురరాని హృదయమందు చెదరని స్వప్నానివో
(సయ్యారే సయ్యా సందేళ మామయ్య వచ్చాడే)
(ఈ వయ్యారి ఒళ్ళోన తెల్లారి ఉయ్యాలలూగాడే)
నిన్ను చూసి నన్ను నేను మరిచిపోతినే
నిన్ను తలచి నేను ఇలా మారిపోతెనే
నీలోన నేనుండనా నీకు నూరేళ్ళు తోడుండనా
నీడల్లే నేనుండనా నీ గుండెల్లో దాగుండనా
గుప్పెడైన గుండెలోన గూడు కట్టి ఉండనా