Inko Rojochindandi
Balaji, S. P. Balasubrahmanyam
Popularity · Low
Listen
YouTube
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
రామ రామ శ్రీ రమాపతే ఇయ్యరావయా మాకు సద్గతి
నీలకందరా హరోం హరా దారి చూపరా ఆదిశంకరా
ఇంకో రోజొచ్చిందండి మీకోసం నాకోసం
గుండెల్లో పొంగిందండి ఉల్లాసం ఉత్సాహం
యెద తలుపులు తెరిచేయాలి
అరమరికల తెర తీయాలి
తొలి వెలుగును ఆహ్వానించాలి. హో
గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్
ఇంకో రోజొచ్చిందండి మీకోసం నాకోసం
గుండెల్లో పొంగిందండి ఉల్లాసం ఉత్సాహం
వెలుగు నింపే దీపమా శక్తిని మాకీయుమా
ప్రేమ సాగరమా ప్రేరణ మీయుమా
ఏ పాపం తెలియని ఈ పాపాలను చల్లగా చూడు దేవా
నవ్వులనే పువ్వులు చేద్దాం పువ్వులనే
పున్నమి చేద్దాం అల్లరితో పల్లవి పాడేద్దాం
కన్నీళ్ళకు కళ్ళెం వేద్దాం కష్టాలకు
సెలవిచ్చేద్దాం ఆనందం అస్వాదించేద్దాం
మనసు అందంగా ఉంటే అంతా అందంగానే కనిపిస్తుంది కదా
హో... అందాలే విరబూసింది ఈ లోకం మన లోకం
అందామా ఇంకో రోజుకు హుందాగా ఓ వెల్కమ్(welcome)
లేరుగా ఈ లోకంలో మీకంటే అతి మంచోళ్ళు
మంచిగా పైపై నటనలు చేసే వాళ్ళే పిచ్చోళ్ళు
అరె ఆ డబ్బు పిచ్చి అధికార పిచ్చి ఓరయ్యో మనకొద్దురా
నరజాతిని పీడించే విద్రోహ పిచ్చి
విధ్వంస పిచ్చి విద్వేష పిచ్చి ఈ కోటలో రద్దురా
పరమాత్మలు మీరేరా యారో
నవ్వండి నవ్వండి మాక్కూడా నేర్పండి
సెలవంటూ వీడ్కోలిచ్చి వెళ్ళాడు సూరీడు
ఆ పక్కన భూమిని నిద్దర లేపాడు లేపాడు
ఈ మాపటి చీకటి చూసి భయపడడం ఇక మానేసి కల కందాం రేపటి ఉదయాన్ని
డోంట్ వర్రీ బి హ్యాపీ (Don't worry be happy)
అందరికీ శుభరాత్రి
సెలవంటూ వీడ్కోలిచ్చి వెళ్ళాడు సూరీడు
ఆ పక్కన భూమిని నిద్దర లేపాడు లేపాడు