Skip to content

Nee Navvula

Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ నీ పెదవుల ఎరద్రనాన్ని గోరింటాకే అరువడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ నీ కోకను సీతాకోక నీ పలుకులు చిలకల మూక నీ చూపును చంద్రలేఖ నీ కొంగును ఏరువాక బదులిమ్మంటు బ్రతిమాలాయి ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ అసలివ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ నీ బుగ్గల్లోని సిగ్గులు కొన్ని మొగ్గలకైనా ఇవ్వద్దు నా వైపే మొగ్గిన నీకైతే అది మొత్తం ఇవ్వచ్చు నీ బాసల్లోని తియ్యదనాన్ని తెలుగు భాషకే ఇవ్వద్దు నాకోసం వేచిన నీకైతే అది రాశిగా ఇవ్వచ్చు భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు నీకై మొక్కే నాకే ఇవ్వచ్చు నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ నీ పెదవుల ఎరద్రనాన్ని గోరింటాకే అరువడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ నీ అందం పొగిడే అవకాశాన్ని కవులకు సైతం ఇవ్వద్దు మరి నాకై పుట్టిన నీకైతే అది పూర్తిగ ఇవ్వచ్చు నీ భారం మోసే అదృష్టాన్ని భూమికి సైతం ఇవ్వద్దు నీనంటే మెచ్చిన నీకైతే అది వెంటనే ఇవ్వచ్చు నిను హత్తుకు పోయే భాగ్యాన్ని నీ దుస్తులకైనా ఇవ్వద్దు నిను హత్తుకు పోయే భాగ్యాన్ని నీ దుస్తులకైనా ఇవ్వద్దు నీకై బ్రతికే నాకే ఇవ్వచ్చు నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ నీ పెదవుల ఎరద్రనాన్ని గోరింటాకే అరువడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ నా వాకిట ముగ్గులు నీకే నా దోసిట మల్లెలు నీకే నా పాపిటి వెలుగులు నీకే నా మాపటి మెరుపులు నీకే ప్రాయం ప్రణయం ప్రాణం నీకే ఇచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా బదులిచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా