Diwali Deepaanni
Andrea, Kalyan, Dhada, 2011
Popularity · Low
Listen
YouTube
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
చక్కెర చిన్నోడా అలే కత్తెర కళ్లోడా
అలే చూడర బుల్లోడా అలే అందాన్ని
ఒంటరి పిల్లోడా అలే తుంటరి పిల్లోడా
అలే వద్దకు లాగెయ్ రా అలే వజ్రాన్ని
దీవాళి దీపాన్ని సాంబ్రాణి ధూపాన్ని
నీ కళ్లలోన ఆకళ్లు పెంచే రూపాన్ని
బంధించే దారాన్ని తీపనిపించే కారాన్ని
ఎన్నటికైనా నిన్నే కోరే నీదాన్ని
చక్కెర చిన్నోడా అలే కత్తెర కళ్లోడా
అలే చూడర బుల్లోడా అలే అందాన్ని
ఊరించే నిషాని ఊపిరిపోసే విషాన్ని
నెత్తురు లోతుకు హత్తుకుపోయిన స్నేహాన్ని
అత్తరు పూసిన బాణాన్ని అల్లాడిస్తా ప్రాణాన్ని
అల్లుకుపోరా కాముడు రాసిన గ్రంథాన్ని
చక్కెర చిన్నోడా అలే కత్తెర కళ్లోడా
అలే చూడర బుల్లోడా అలే అందాన్ని
కదిలే నావలా వయసే ఊయల
ఎదటే నువ్వలా గిచ్చే కన్నై చూస్తుంటే
నిజమా ఈ కల అనిపించేంతలా
మనసే గువ్వలా గాల్లో తేలిందే
నీపక్క చోటిస్తే నన్నే నానుంచి దోచిస్తా
నాకే నీలోన చోటిస్తే నన్నే దాచేస్తా
ఓ... నీ గూడు నాకిస్తే ఇందా నా గుండె నీకిస్తా
నీతో వెయ్యేళ్లు రానిస్తే నన్నే రాసిస్తా
దీవాళి దీపాన్ని సాంబ్రాణి ధూపాన్ని
నీ కళ్లలోన ఆకళ్లు పెంచే రూపాన్ని
బంధించే దారాన్ని తీపనిపించే కారాన్ని
ఎన్నటికైనా నిన్నే కోరే నీదాన్ని
ఒకడే వేయిగా కదిలే మాయగా
కనిపించావుగా అటూ ఇటూ నా చుట్టూ
సలసల హాయిగా సరసున రాయిగా
కదిలించావుగా ప్రాయం పొంగేట్టు
పొందుకు వస్తావో నాతో పొత్తుకు వస్తావో
ఎటో ఎత్తుకు పోతావో అంతా నీ ఇష్టం
ఉప్పెన తెస్తావో నొప్పిని ఉఫ్ఫనిపిస్తావో
తప్పని తప్పును చేస్తావో అందం నీ సొంతం
దీవాళి దీపాన్ని సాంబ్రాణి ధూపాన్ని
నీ కళ్లలోన ఆకళ్లు పెంచే రూపాన్ని
బంధించే దారాన్ని తీపనిపించే కారాన్ని
ఎన్నటికైనా నిన్నే కోరే నీదాన్ని