Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Rama Silaka
R.R. Dhruvan
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ఆకూ పచ్చ చీర కట్టూకున్నదంట
అందంగా ఈ చోటు
మంచూ పూలు అల్లి పెట్టూకున్నదంట
జల్లోన ప్రతి చెట్టు
మాబ్భూ తెరలు ఎన్నో చుట్టూకున్నదంట
ఈ గాలి మెరిసేట్టు
నింగీ అంచులను తాకేనంట
మది చూస్తుంటే ఈ గుట్టు
పొద్దు తొంగి తొంగి మరి చూసెనంట
చూడబోతే రెండు కళ్లు చాలవంట
వాన విల్లే నేలపై వాలెనంట
అమ్మ ఒళ్లో చేరినట్టు ఉన్నదంట
రామసిలకా రామసిలకా సూడే నేలవంక
రామ సక్కని అందాలెన్నో
కొండా కోన వెనక
రామసిలకా రామసిలకా సూడే నేలవంక
సూడ సక్కని సిత్రాలెన్నో
దాగున్నాయి వెనక
ఎన్నో రంగులను చల్లిందంట చూడు
ఆ నీలి ఆకాశం
పొంగీపోయి ఇల చేసిందంట
మరి పచ్చంగా సావాసం
నింగీ నేల కూడి
ఎన్నో వింతలను ఉంచాయి మనకోసం
ఎన్నాళ్లయితేనేమి స్వర్గం అయిపోద
ఈ చోట వనవాసం
సాగిపోతూవుంటే ఈ దారిలోన
ఆగిపోదా గుండెలోన బాదవున్నా
తేలిపోతూవుంటే ఈ హాయిలోన
ఇంతకన్నా ఊపిరేది జీవితాన
రామసిలకా రామసిలకా సూడే నేలవంక
రామ సక్కని అందాలెన్నో
కొండా కోన వెనక
రామసిలకా రామసిలకా సూడే నేలవంక
సూడసక్కని సిత్రాలెన్నో
దాగున్నాయి వెనక