Paadana Thelugupaata
P. Susheela, G.K. Venkatesh
Popularity · Low
Listen
YouTube
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
పాడనా తెనుగు పాట
పాడనా తెనుగు పాట
పరవశనై మీ ఎదుట మీ పాట
పాడనా తెనుగు పాట
కోవెల గంటల గణగణలో గోదావరి తరగల గలగలలో
కోవెల గంటల గణగణలో గోదావరి తరగల గలగలలో
మావులు పూవులు మోపులపైన మసలేగాలుల గుసగుసలో
మంచి ముత్యాల పేట మధురామృతాల తేట
ఒకపాట పాడనా తెనుగు పాట
పరవశనై నే పరవశనై మీ ఎదుట మీ పాట
పాడనా తెనుగు పాట
త్యాగయ క్షేత్రయ రామదాసులు
త్యాగయ క్షేత్రయ రామదాసులు తనివితీర వినిపించినది
త్యాగయ క్షేత్రయ రామదాసులు తనివితీర వినిపించినది
నాడునాడులా కదిలించేది వాడవాడలా కరిగించేది
చక్కెర మాటల మూట చిక్కని తేనెల ఊట
ఒక పాట పాడనా తెనుగు పాట
ఒళ్ళంత ఒయ్యారి కోక కళ్ళకు కాటుక రేఖ
ఒళ్ళంత ఒయ్యారి కోక కళ్ళకు కాటుక రేఖ
మెళ్ళో తాళి కాళ్ళకు పారాణి మెరిసే కుంకుమ బొట్టు
ఘల్లు ఘల్లున కడియాలందెలు అల్లనల్లనా నడయాడే
తెలుగు తల్లి పెట్టని కోట తెలుగు నాట ప్రతిచోట
ఒక పాట పాడనా తెనుగు పాట
పరవశనై నే పరవశనై మీ ఎదుట మీ పాట
పాడనా తెనుగు పాట