Skip to content

Nenoka Prama Pipaasini

Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

ఆఆ ఆహ ఆఆ ఆహ ఆఆఆ అహ ఆహ నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది నేనొక ప్రేమ పిపాసిని తలుపు మూసిన తలవాకిటినే పగలు రేయి నిలుచున్నా పిలిచి పిలిచి బదులేరాక అలసి తిరిగి వెళుతున్నా తలుపు మూసిన తలవాకిటినే పగలు రేయి నిలుచున్నా పిలిచి పిలిచి బదులేరాక అలసి తిరిగి వెళుతున్నా నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది నేనొక ప్రేమ పిపాసిని పూట పూట నీ పూజ కోసమని పువ్వులు తెచ్చాను ప్రేమ భిక్షనూ పెట్టగలవని దోసిలి ఒగ్గాను నీ అడుగులకు మడుగులోత్తగా ఎడదను పరిచాను నీవు రాకనే అడుగు పడకనే నలిగిపోయాను నేనొక ప్రేమ పిపాసిని పగటికి రేయి రేయికి పగలు పలికే వీడ్కోలు సెగ రేగిన గుండెకు చెబుతున్నా నీ చెవిన పడితే చాలు నీ జ్ఞాపకాల నీడలలో నన్నేపుడో చూస్తావు నను వలచావని తెలిపేలోగా నివురైపోతాను నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది నేనొక ప్రేమ పిపాసినీ