Amma Kadupu Challaga
Popularity · Low
Listen
YouTube
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా బతకరా బతకరా పచ్చగా
నీకు నేనుంటా వెయ్యేళ్ళు తోడుగా నీడగా
అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా బతకరా బతకరా పచ్చగా
నా మెడలో తాళీబొట్టు కట్టరా నా నుదటా నిలువు బొట్టు పెట్టరా

నీ పెదవి మీద సిరునవ్వు సెరగదురా నా సిగపూవుల రేకైనా వాడదురా వాడదురా
బతకరా బతకరా పచ్చగా
చల్లని అయిరేణికి మొక్కరా సన్నికల్లు మీదకాలు తొక్కరా

చల్లనేళ కంటనీరు వద్దురా నా నల్ల పూసలే నీకు రక్షరా రక్షరా
బతకరా బతకరా పచ్చగా
నా కొంగు నీ చెంగూ ముడివేయరా నా చేయీ నీ చేయీ కలపరా

ఏడడుగులు నాతో నడవరా ఆ యముడైనా మనమద్దికి రాడురా రాడురా