Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Ekkada Ekkada
Mani Sharma
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఉందో తారకా
నాలో ఉక్కిరి బిక్కిరి
ఊహలు రేపే గోపికా
తుంటరి తుంటరి తుంటరి
చూపులు చాలికా
ఓహో అల్లరి అల్లరి అల్లరి
ఆశలు రేపకా
నా కోసమే తళుక్కన్నదో
నా పేరునే పిలుస్తున్నదో
పూవానగా కురుస్తున్నదీ
నా చూపులో మెరుస్తున్నదీ
ఏ ఊరే అందమా ఆచూకీ అందుమా
కవ్వించే చంద్రమా దోబూచీ చాలమ్మా
ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఉందో తారకా
ఓహో అల్లరి అల్లరి అల్లరి
ఆశలు రేపకా
కులుకులో ఆ మెలికలూ
మేఘాలలో మెరుపులూ
పలుకులూ ఆ పెదవులూ
మన తెలుగు రాచిలకలూ
పదునులూ ఆ చూపులూ
చురుకైన చురకత్తులూ
పరుగులూ ఆ అడుగులూ
గోదారిలో వరదలూ
నా గుండెలో అదో మాదిరి
నింపేయకే సుధామాధురీ
నా కళ్లలో కలల పందిరీ
అల్లేయకోయి మహా పోకిరీ
మబ్బుల్లో దాగుందీ తనవైపే లాగిందీ
సిగ్గల్లే తాకిందీ బుగ్గల్లో పాకిందీ
ఓహో తుంటరి తుంటరి తుంటరి
చూపులు చాలికా
ఎవ్వరూ నన్నడగరే అతగాడి రూపేంటనీ
అడిగితే చూపించనా నిలువెత్తు చిరునవ్వునీ
మెరుపుని తొలి చినుకునీ
కలగలిపి చూడాలనీ
ఎవరికీ అనిపించినా చూడొచ్చు
నా చెలియనీ
ఎన్నాళ్లిలా తనోస్తాడనీ
చూడాలటా ప్రతీ దారినీ
ఏ తోటలో తనుందోననీ
ఎటు పంపనూ నా మనసునీ
ఏనాడూ ఇంతిదిగా కంగారే ఎరుగనుగా
అవునన్నా కాదన్నా గుండెలకు కుదురుందా
తుంటరి తుంటరి తుంటరి
చూపులు చాలికా
ఓహో అల్లరి అల్లరి అల్లరి
ఆశలు రేపకా
ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఉందో తారకా
నాలో ఉక్కిరి బిక్కిరి
ఊహలు రేపే గోపికా
పూవానగా కురుస్తున్నదీ
నా చూపులో మెరుస్తున్నదీ
నా కోసమే తళుక్కన్నదో
నా పేరునే పిలుస్తున్నదో
కవ్వించే చంద్రమా దోబుచీ చాలమ్మా
ఏ ఊరే అందమా
ఆచూకీ అందుమా
అక్కడ అక్కడ అక్కడ
ఉందా తారకా
అదిగో తెల్లని మబ్బుల
మధ్యన దాగీ దాగక