Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Ghal Ghal
S. P. Balasubramanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
(ఘల్ ఘల్ ఘల్ ఘల్)
(ఘలన్ ఘలన్ ఘల ఘల్ ఘల్)
(ఘల్ ఘల్ ఘల్ ఘల్)
(ఘలన్ ఘలన్ ఘల ఘల్ ఘల్)
ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల
అందించే ఆహ్వానం ప్రేమంటే
ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా
పిలిపించే తడిగానం ప్రేమంటే
అణువణువును మీటే మమతల మౌనం
పద పదమంటే నిలవదు ప్రాణం
ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం
దాహంలో మునిగిన చివురుకు
చల్లని తన చెయ్యందించి
స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే
మేఘంలో నిద్దుర పోయిన
రంగులు అన్నీ రప్పించి
మాగాణి ముంగిట పెట్టే
ముగ్గే ప్రేమంటే
(ఘల్ ఘల్ ఘల్ ఘల్)
(ఘలన్ ఘలన్ ఘల ఘల్ ఘల్)
(ఘల్ ఘల్ ఘల్ ఘల్)
(ఘలన్ ఘలన్ ఘల ఘల్ ఘల్)
ప్రాణం ఎపుడు మొదలైందో
తెలుపగల తేది ఏదో
గుర్తించేందుకు వీలుందా
ప్రణయం ఎవరి హృదయంలో
ఎపుడు ఉదయిస్తుందో
గమనించే సమయం ఉంటుందా
ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే
ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే
అది చరితను సైతం చదవని వైనం
కవితను సైతం పలకని భావం
సరిగమ లెరుగని మధురిమ ప్రేమంటే
దరిదాటి ఉరకలు వేసే
ఏ నదికైనా తెలిసిందా
తనలో ఈ ఒరవడి పెంచిన
తొలి చినుకేదంటే
సిరి పైరై ఎగిరే వరకు
చేనుకు మాత్రం తెలిసిందా
తనలో కనిపించే కళలకు
తొలి పిలుపేదంటే
(ఘల్ ఘల్ ఘల్ ఘల్)
(ఘలన్ ఘలన్ ఘల ఘల్ ఘల్)
(ఘల్ ఘల్ ఘల్ ఘల్)
(ఘలన్ ఘలన్ ఘల ఘల్ ఘల్)
మండే కొలిమినడగందే
తెలియదే మన్నుకాదు
ఇది స్వర్ణమంటూ చూపాలంటే
పండే పొలము చెబుతుందే
పదునుగా నాటే నాగలి పోటే
చేసిన మేలంటే
తనువంతా విరబూసే గాయాలే వరమాలై
దరిజేరే ప్రియురాలే గెలుపంటే
తను కొలువై ఉండే విలువే ఉంటే
అలాంటి మనసుకు తనంత తానై
అడగక దొరికే వరమే వలపంటే
జన్మంతా నీ అడుగుల్లో
అడుగులు కలిపే జతవుంటే
నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా
రేయంతా నీ తలపులతో
ఎర్రబడే కన్నులు ఉంటే
ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా
(ఘల్ ఘల్ ఘల్ ఘల్)
(ఘలన్ ఘలన్ ఘల ఘల్ ఘల్)
(ఘల్ ఘల్ ఘల్ ఘల్)
(ఘలన్ ఘలన్ ఘల ఘల్ ఘల్)