Skip to content

Thelusa Manasa

M. M. Keeravani & Chitra
Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శతజన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో ఎన్నడూ తీరిపోని రుణముగా ఉండిపో చెలిమితో తీగ సాగే మల్లెగా అల్లుకో లోకమే మారినా కాలమే ఆగినా మన ఈ గాధ మిగలాలి తుదిలేని చరితగ తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో ప్రతిక్షణం నా కళ్ళల్లో నిలిచె నీ రూపం బ్రతుకులో అడుగడుగున నడిపె నీ స్నేహం ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా పది కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగ తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శతజన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో