Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Jilibili Palukula
Ilaiyaraaja
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన
ఓ మైనా మైనా
కిలకిల నగవుల వలపులు చిలికిన
ఓ మైనా మైనా
మిల మిల మెరిసిన తార
మిన్నుల విడిన సితార
మిల మిల మెరిసిన తార
మిన్నుల విడిన సితార
మధువుల పెదవుల మమతలు విరిసిన
ఓ మైనా ఓ మైనా
కలలను పెంచకు, కలతను దాచకు
ఏమైనా ఓ మైనా
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన
ఓ మైనా మైనా
కిలకిల నగవుల వలపులు చిలికిన
ఓ మైనా మైనా
అడగనులే చిరునామా
ఓ మైనా ఓ మైనా
చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా
తారలకే సిగపువ్వా తారాడే సిరిమువ్వా
తారలకే సిగపువ్వా తారాడే సిరిమువ్వా
హరివిల్లు రంగుల్లో వర్ణాలే
చిలికిన చిలకవు ఉలకవు పలకవు
ఓ మైనా ఏమైనా
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన
ఓ మైనా మైనా
ఉరుములలో అలికిడిలా వినిపించే
ఈ మైనా
మెరుపులలో నిలకడగా కనిపించే ఏమైనా
ఎండలకే అల్లాడే వెన్నెలలో క్రీనీడ
ఎండలకే అల్లాడే వెన్నెలలో క్రీనీడ
వినువీధి వీణల్లో రాగంలా
ఆశల ముంగిట ఊహల ముగ్గులు
నిలిపేనా ఏమైనా
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన
ఓ మైనా మైనా
తొలకరి వయసుల మిణుగురు సొగసులదీ
మైనా మైనా
మిల మిల మెరిసిన తార
మిన్నుల విడిన సితార
గుడికే చేరని దీపం
పడమటి సంధ్యారాగం
మధువుల పెదవుల మమతలు విరిసిన
ఓ మైనా ఓ మైనా
చుక్కలు అందక దిక్కుల దాగిన
నేనేలే ఆ మైనా
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన
ఓ మైనా మైనా
తొలకరి వయసుల మిణుగురు సొగసులదీ
మైనా మైనా